Share News

తులాభారం

ABN , Publish Date - Feb 04 , 2025 | 11:28 PM

మం డలంలోని పాలెం వేంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్‌ తులాభారం సమర్పిం చారు.

తులాభారం
పాలెం వెంకన్న స్వామి ఆలయంలో తులాభారం సమర్పిస్తున్న ధర్మకర్తల మండలి చైర్మన్‌ మనుసాని విష్ణుమూర్తి

- పోటెత్తిన భక్తజనం

- భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

బిజినేపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని పాలెం వేంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్‌ తులాభారం సమర్పిం చారు. పలువురు భక్తులు కూడా స్వామి వారికి తమ ఎత్తు బంగారాన్ని (పటిక బెల్లం) తులా భారం ద్వారా సమర్పించి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి కావడంతో ఆలయంలో అలువేలు మంగసమేత వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తా రు. అలాగే రథసప్తమి పర్వదినం పురస్కరించు కొని వందలాది భక్తులు సామూ హిక సత్యనారాయణ స్వామి వ్ర తాలు చేశారు. మంగళవారం అర్థ రాత్రి తర్వాత చేపట్టనున్న రథోత్స వానికి (తేరు) ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు చైర్మన్‌ మనుసాని విష్ణుమూర్తి, ఆలయ కార్యానిర్వహణ అధికారి చి లుకూరు రంగారావులు తెలిపారు. తులాభా రంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఆలయ కమిటీ సభ్యులు గాడి సురేందర్‌, సొప్ప రి బాలస్వామి, కురుమయ్య, మాజీ వార్డు మెం బర్‌ ఐల రవీందర్‌రెడ్డి, కొంకలి మధు, శ్రీనివా సులు, నరసింహ, నవీన్‌ ఉన్నారు.

రూ.2.50 లక్షలతో లైట్ల ఏర్పాటు

మండలంలోని పాలెం గ్రామానికి చెందిన వ ర్కాల శ్రీరాములు అనే భక్తుడు తన భార్య జయప్రద జ్ఞాపకార్థం రూ.2.50 లక్షల విలువైన లైట్లను ఆలయానికి మంగళవారం అందజేసిన ట్లు ఈవో రంగారావు తెలిపారు. అంతకు ముం దు స్వామి వారికి రూ.5 లక్షల విలువైన వెండి కిరీటం, కర్ణాభరణం, సూర్యకటారి, అమ్మవారికి వెండి కిరీటం, కర్ణ ఆభరణాలు అందజేసి భక్తి చాటుకున్నారని ఈవో అన్నారు. శ్రీరాములు కుటుంబ సభ్యులను ప్రధాన అర్చకులు ఆశీర్వదించారు.

Updated Date - Feb 04 , 2025 | 11:28 PM