Share News

పల్లె వదిలి.. పట్నం వైపు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:51 PM

సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో పట్నం విడిచి స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు.

పల్లె వదిలి.. పట్నం వైపు
చౌటుప్పల్‌ పట్టణం నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న వాహనాలు

బీబీనగర్‌, చౌటుప్పల్‌ టౌన్‌, చౌటుప్పల్‌ రూరల్‌, కేతేపల్లి, కోదాడ రూరల్‌, చిట్యాల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో పట్నం విడిచి స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిఽ ద ప్రాంతాలకు వెళ్లిన వారు బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. బీబీనగర్‌ మండలం గూడూరు, చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ దృష్ట్యా టోల్‌సిబ్బంది వాహనాలు నిలిచిపోకుండా క్రమ పద్ధతిన వాహనాలను టోల్‌గేట్లలోకి పంపిస్తూ ట్రాఫిక్‌ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ద్విచక్ర వాహనదారులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు

ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రమా దాలకు గురికాకుండా పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా రు. మద్యం తాగిన శాతం ఎక్కువగా కనిపించిన వారిని నిలిపేస్తున్నారు. తక్కువ శాతం ఉన్న వారికి కౌన్సెలింగ్‌ చేసి జరిమానా వేసి పంపుతు న్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 16గేట్లు కాగా హైదరాబాద్‌ వైపు 12గేట్ల నుంచి విజయవాడ వైపు నాలుగు గేట్ల నుంచి అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల వాహనాలు వెళు తుండగా, గురువారం అదనంగా 10వేల వాహనాలు వెళ్లాయి.

రద్దీకి అనుగుణంగా కౌంటర్లు

కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాలోని 12టోల్‌ వసూలు కౌంటర్లలో వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు ఏడు కౌంటర్లు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు 5కౌంటర్లు కేటాయించారు. టోల్‌ కౌంటర్లలోని ఫాస్టాగ్‌ స్కానర్లు వేగంగా పనిచేయడం, ఏదైనా స్కానర్‌ సక్రమంగా పనిచేయకుంటే అక్కడే ఉన్న సిబ్బంది స్టిక్‌ స్కానర్లతో ఫాస్టాగ్‌లను స్కాన్‌ చేస్తుండటంతో టోల్‌ కౌం టర్‌లోకి వచ్చిన వాహనం వచ్చినట్లు క్షణాల్లో వేగంగా ముం దుకు కదిలి వెళుతోంది. సాధారణ రోజుల్లో 17వేల వాహనాలు వెళుతుండగా, గురువారం 50వేల వాహనాలు వెళ్లాయి. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై చిట్యాల శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద కంటైనర్‌ ఇరుక్కుని ట్రాఫిక్‌ భారీగా నిలిచింది.

బస్సులు లేక పడిగాపులు

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూర్లకు వెళ్ళి తిరిగి స్వస్థలాలకు వచ్చేందుకు కోదాడ బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాశారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటకు సరిపడా బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా గురువారం ఉదయం పెద్దఎత్తున ప్రయాణికులు బస్టాండ్‌కు చేరుకున్నారు. సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని వాపోయారు. హైదరాబాద్‌కు ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు కూడా బస్సులు లేవని వాపోయారు. సాధారణ రోజుల్లో కోదాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.350కాగా, రూ.700నుంచి రూ.1000 చెల్లించి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు.

2వేల మంది పోలీసులతో ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించాం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 2వేల మంది పోలీసులను నియమించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిం చామని రాచకొండ కమిషనరేట్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద గురు వారం రాత్రి ట్రాఫిక్‌ను పరిశీలించారు. పోలీస్‌ సిబ్బంది, టోల్‌గేట్‌ నిర్వహకులకు పలు సూచనలు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ట్రాఫిక్‌ సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నా మని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వైపు వాహనాలను మళ్లించడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తలేదని పేర్కొన్నారు. ఫాస్టాగ్‌, ట్రాఫిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణకు సివిల్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, ఎస్‌వోటీ, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మద కుమార్‌, టోల్‌గేట్‌ మేనేజర్‌ సతీష్‌ యాదవ్‌, ట్రాఫిక్‌ సీఐ విజయ్‌మోహన్‌ ఉన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:51 PM