Land Survey: ఎఫ్‌సీడీఏ, ఎన్‌ఐయూఎం కార్యాలయాల కోసం మీర్కాన్‌పేటలో భూముల పరిశీలన
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:28 AM
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఫ్యూచర్‌సిటీలో
కందుకూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఫ్యూచర్‌సిటీలో భాగంగా అక్కడే మరో రెండు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అధికారులు భూములను పరిశీలించారు. ఇప్పటికే అక్కడ యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం), ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అఽథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయాల నిర్మాణాల కోసం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి, ఫ్యూచర్‌సిటీ కమిషనర్ శశాంక, ఎండీహెచ్‌యూఎన్ కార్యదర్శి కె.శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌లతో కలిసి మీర్కాన్‌పేట రెవెన్యూ పరిధిలోని 112 సర్వే నంబర్‌లోని భూములను, ఎన్‌ఐయూఎం కార్యాలయానికి 20 ఎకరాలు, ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి 7 నుంచి 20ఎకరాల భూములను పరిశీలించారు. మీర్కాన్‌పేట-యాచారం రోడ్డు సమీపంలో ఆ భూములను పరిశీలించారు.