KTR: అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం కాదు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:58 AM
టీఆర్ భూములు చెరబట్టడం, బుల్డోజర్లు ఉపయోగించడం అభివృద్ధి కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై అవినీతికి సంబంధించిన ప్రశ్నలు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పనులు నత్తనడకగా సాగుతున్నాయని విమర్శించారు

కాంగ్రెస్ అంటే కక్ష తీర్చుకోవడమేనా ?
రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ చురకలు
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే కక్ష తీర్చుకోవడం ? కమీషన్లు దండుకోవడం ? కబ్జాలు చేసుకోవడమేనా ? అని ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌ఎ్‌సడీపీ పనులు, ఫలక్‌నూమా ఆర్వోబీ, శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెన నిర్మాణం తదితర పనులు నత్తనడకన సాగుతున్న తీరుపై ‘ఎక్కడివక్కడే’ అనే శీర్షిక్షతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనానికి కేటీఆర్ స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్‌లో పోస్టు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులుపెట్టి చంచల్‌గూడ జైలుకు పంపడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ.. దాని ముందు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడంపై లేదని కేటీఆర్ విమర్శించారు. కాగా, తనకు వచ్చిన రెండు వేల రూపాయల పింఛనులో నుంచి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవ్వండని పార్టీ నేతలకు బోడబాజీ అనే వృద్ధురాలు రూ.వెయ్యి అందజేయడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఎంతో మంది కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకులా భావిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.