KTR: కాంగ్రెస్ సర్కార్‌ది ఆర్థిక దుష్ప్రచారం: కేటీఆర్
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:23 AM
రాష్ట్రంలో ప్రతినెలా రూ.7,000 కోట్ల రుణవడ్డీ చెల్లిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి..
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతినెలా రూ.7,000 కోట్ల రుణవడ్డీ చెల్లిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు గత కేసీఆర్ ప్రభుత్వంపై అబద్ధాలు చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ వాదన తప్పని కాగ్ నివేదిక తేల్చిందని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. వాస్తవానికి గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.