Share News

Konda Murali: నాడు బీఆర్‌ఎస్‌‌ను ముంచి.. నేడు కాంగ్రెస్‌‌ను నాశనం చేస్తున్నడు

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:42 AM

ఎవరైనా మీసాలు, గడ్డాలు గీయించుకుంటారు.. కానీ, ఈ నాయకుడైతే కను బొమ్మలు గీయించుకుంటడు. టీడీపీలో 15ఏళ్లు ఉండి, మంత్రి పదవులు అనుభవించి ఆ పార్టీని భ్రష్టు పట్టించాడు.

Konda Murali: నాడు బీఆర్‌ఎస్‌‌ను ముంచి.. నేడు కాంగ్రెస్‌‌ను నాశనం చేస్తున్నడు

  • నాడు కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. ఇప్పుడు ఎమ్మెల్యే

  • కోడి కూడా పొడవనోడికి గన్‌మెన్‌ ఎందుకు?

  • కడియం, రేవూరి, ఎర్రబెల్లిపై కొండా మురళి ధ్వజం

  • సురేఖ మంత్రి పదవికి ఏం ఢోకా లేదని వ్యాఖ్య

  • ఆమెకు మూడు శాఖలున్నా పైసా రాదు..

  • నెలకు 5లక్షలు తానే పంపుతున్నానని వెల్లడి

వరంగల్‌ సిటీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరైనా మీసాలు, గడ్డాలు గీయించుకుంటారు.. కానీ, ఈ నాయకుడైతే కను బొమ్మలు గీయించుకుంటడు. టీడీపీలో 15ఏళ్లు ఉండి, మంత్రి పదవులు అనుభవించి ఆ పార్టీని భ్రష్టు పట్టించాడు. తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తప్పుదోవ పట్టించి నాశనం చేశాడు. ఇప్పుడు కాంగ్రె్‌సలో చేరి.. పార్టీని కరాబు చేస్తున్నడు’’ అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు విమర్శించారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో గురువారం ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొండా మురళీధర్‌రావు హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్జత్‌, మానవత్వం ఉంటే...


బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు కాళ్లు పట్టుకున్న నాయకుడు.. ఈ రోజు పరకాల ఎమ్మెల్యే అయ్యాడని వ్యాఖ్యానించారు. ‘‘నీ ఫామ్‌ హౌస్‌లో, నీ కోళ్ల ఫామ్‌లో నిన్ను కోడి కూడా పొడవదు.. నీకెందుకు గన్‌మెన్‌.. నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టే’’ అంటూ ఎర్రబెల్లిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఉన్నారని, ఇక్కడ రేవంత్‌రెడ్డి ఉన్నారని, సురేఖ మంత్రి పదవికి ఏం ఢోకా లేదని స్పష్టం చేశారు. సురేఖకు మూడు శాఖలున్నా.. పైసా రాదని, తానే నెలకు రూ.5లక్షలు పంపుతున్నానని పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 04:42 AM