ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశాం
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:19 AM
ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన వాగ్ధానాల్లో సగం పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

శాసనభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన వాగ్ధానాల్లో సగం పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ.. తదితర పథకాలను 15 నెలల్లో పూర్తి చేశామని, తమకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉందని.. మిగతావీ పూర్తి చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు.
దళితుడిని సీఎం చేయకపోతే మెడ మీద తలకాయ ఉండదన్నావు కదా.. నువ్వు ఇంప్లిమెంట్ చేశావా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నావు కాదా.. ఇచ్చావా? దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే... సంతలో పశువుల లెక్కన కొనుక్కొని దళిత వ్యతిరేకత చూపుకున్నవు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌బెడ్ రూమ్, లక్ష అబద్ధాలు ఆడి... రెండు సార్లు అధికారంలోకి వచ్చావు’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.