నాగార్జునసాగర్‌లో కైట్ ఫ్లయర్స్ సందడి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:53 PM
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను దేశ, విదేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ సందడి చేశారు.

నాగార్జునసాగర్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను దేశ, విదేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ సందడి చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభు త్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంత ర్జాతీయ పతంగుల పండుగకు దేశంలోని 14రాష్ట్రాలకు చెందిన ఫ్లయర్స్ తో పాటు పాటు సింగపూర్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, పోలాండ్, ఉక్రెయిన్, శ్రీలంక, కంబో డియా, వియత్నాం, ఇండోనేషియా, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు మరో 20దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ హాజర య్యారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఫెస్టివ ల్‌లో పాల్గొన్న వారంతా గురువారం సాగర్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా బుద్ధవనానికి వచ్చిన వారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన్, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం బుద్ధ వనంలో స్తూప వనం, జాతక వనం, మహాస్తూపం, చరిత వనం, ఆశోక చక్రం తిలకించారు. తరువాత లాంచీలో జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు చేరుకున్నారు.
అక్కడ మ్యూజియం, సింహళీయం, బౌద్ధ మత స్తూపాలను, నమూ నాలను తిలకించారు. బుద్ధవనం గురించి పవర్ పాయింట్ ప్రజేటేషన్ ద్వారా అఽధికారులు వారికి వివరించారు. నాగార్జునకొండ విశేషాలను పర్యాటక శాఖగైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట పర్యాటక శాఖ అధికారి లోకేష్ తదితరులు ఉన్నారు.