Share News

Central MInister Kishan Reddy: బొగ్గు గని కార్మికులే నిజమైన వారియర్లు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:02 AM

కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, దేశంలో ఇంధన భద్రతలో బొగ్గు గనులు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశీయ విద్యుత్‌ అవసరాలను 70 శాతానికి పైగా బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తీరుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో గెవరా గని సందర్శించి, బొగ్గు తవ్వకాలను వీక్షించారు

Central MInister Kishan Reddy: బొగ్గు గని కార్మికులే నిజమైన వారియర్లు

  • కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • గెవరాగని కార్మికులతో సహపంక్తి భోజనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇంధన భద్రత కల్పనలో బొగ్గు గనులు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. దేశీయ విద్యుత్‌ అవసరాలను 70 శాతానికి పైగా బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తీరుస్తుందన్నారు. తమ ప్రభుత్వం మైనింగ్‌ కార్యకలాపాల్లో సుస్థిరతకు ప్రాధాన్యమిస్తూ.. ప్రణాళికాబద్దంగా సరైన పద్దతిలో గనులను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అతి పెద్ద బొగ్గు గని గెవరా గనిని గురువారం సందర్శించారు. ఆ గనిలో కార్యకలాపాలపై అధికారులు కేంద్ర మంత్రికి ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. అటుపై మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా గనిలోకి దిగి.. బ్లాస్ట్‌ ఫ్రీ సర్ఫేస్‌ మైనర్‌ సాంకేతికత యంత్రాలతో జరుగుతున్న బొగ్గు తవ్వకాలను వీక్షించారు. యంత్రాల ఆపరేటర్లను అడిగి వాటి పని తీరు తెలుసుకున్నారు. తర్వాత ఆయన కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Updated Date - Apr 11 , 2025 | 05:03 AM