Central Kishan Reddy: సైనికుల సత్తాను తక్కువ చేసే కుట్ర
ABN , Publish Date - May 21 , 2025 | 06:05 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నాయకులు సైనిక సత్తాను తగ్గిస్తూ విమర్శిస్తున్నారని అన్నారు. ఇది దివాళాకోరు మనస్తత్వానికి సరిపడుతుందని పేర్కొన్నారు.
ఆర్మీ విజయాలను కాంగ్రెస్ స్వాగతించలేకపోతోంది
ఇది దివాళాకోరు మనస్తత్వం: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌ను చిన్న యుద్ధం అని పేర్కొంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మన సైనికుల సత్తాను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ఆపరేషన్ గొప్పదనం గురించి భారత్ సహా ప్రపంచమంతా మాట్లాడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీ బలోపేతాన్ని విస్మరించారని, అధికారం కోల్పోయినా ఆర్మీ సాధిస్తోన్న విజయాలను స్వాగతించలేకపోతున్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ దివాళాకోరు మనస్తత్వానికి, మానసిక రుగ్మతకు నిదర్శమని కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు బీఆర్‌ఎస్ ఒప్పందం చేసుకుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు ఇరు పార్టీల నాయకుల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.