Kishan Reddy: బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:03 AM
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, తాగునీటితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీ శ్రేణులను కోరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్రానికి రానున్న 7 ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, తాగునీటితోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల కోసం యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.
బాధితులకు అండగా నిలవాలని కోరిన కిషన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో పర్యటనకు 7 జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ) బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో రెండు బృందాలు, ఖమ్మం, నిర్మల్, ములుగు, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో బృందం సిద్ధంగా ఉన్నాయని వివరించారు.