Audio Release: గజల్ శ్రీనివాస్ సంగీతం, గాత్రంతో సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో విడుదల
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:55 AM
గజల్స్ గాయకుడు కేశిరాజు శ్రీనివాస్ గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో విడుదల కార్యక్రమం పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తండ్రి నరసింహారావు ఆడియోని విడుదల చేశారు

పాలకొల్లు అర్బన్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గజల్స్ గాయకుడు కేశిరాజు శ్రీనివాస్ సంగీతం సమకూర్చి గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత ఆడియో విడుదల కార్యక్రమం గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో జరిగింది. ‘సేవ్ టెంపుల్స్ భారత్-శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆడియోను శ్రీనివాస్ తండ్రి నరసింహారావు విడుదల చేసి లోకార్పణం గావించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హాజరై మాట్లాడుతూ భగవద్గీతను ఎంతో మధురంగా ఆలపించి ప్రజలకు అందించిన గజల్ శ్రీనివాస్ ‘భగవద్గీతను కొనండి అనకుండా వినండి’ అని చెబుతున్నారన్నారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా సంకల్పం వెనుక మిత్రుల బలం ఎంతో ఉందన్నారు. స్నేహితులు తనకు ఇస్తున్న శక్తితో ఈ కార్యక్రమం పూర్తి చేయగలిగానని తెలిపారు.