Defeat Analysis: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:25 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు.
నాలుగున్నర గంటలపాటు సమాలోచనలు
జూబ్లీహిల్స్ వైఫల్యంపై సుదీర్ఘంగా చర్చ
కవిత వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై కూడా!
కవిత వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపైనా..
గజ్వేల్/మర్కుక్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో శనివారం సాయంత్రం భేటీ అయిన కేటీఆర్.. పలు అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమికి కారణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కష్టాన్ని, అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాన్ని వివరించినట్లు సమాచారం. అలాగే, కవిత ఇటీవల పార్టీ నాయకులపై చేస్తున్న కామెంట్లపై సైతం చర్చించినట్లు తెలిసింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి జరుగుతున్న నష్టంపై చర్చ సాగినట్లు సమాచారం. త్వరలోనే పార్టీకి పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగున్నర గంటలపాటు కేసీఆర్, కేటీఆర్ భేటీ సాగినట్లు తెలిసింది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైనా ఆలోచన చేసినట్లు తెలిసింది.