Share News

MLC Kavitha: ఇది జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:08 AM

బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని.. జాగృతి, బీసీబిడ్డల విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

MLC Kavitha: ఇది జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని.. జాగృతి, బీసీబిడ్డల విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.


ప్రభుత్వానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్థి ఉంటే హైకోర్టులో కేవియట్‌ దాఖలు చేసి ఆర్డినెన్స్‌ జారీ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆర్డినెన్సుకు గవర్నర్‌ ఆమోదం తెలిపి తన మర్యాదను నిలబెట్టుకోవాలన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

Updated Date - Jul 12 , 2025 | 04:08 AM