Share News

Kavitha Accuses Congress: కాంగ్రెస్‌కు కరప్షన్‌ గనిగా సింగరేణి

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:01 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కరప్షన్‌ గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

Kavitha Accuses Congress: కాంగ్రెస్‌కు కరప్షన్‌ గనిగా సింగరేణి

  • హెచ్‌ఎంఎ్‌స కార్మిక సంస్థతో కలిసి పని చేస్తాం: కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి ’కరప్షన్‌ గని’గా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్‌ అవినీతికి పాల్పడుతోందన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘ ప్రధానకార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, ఆ సంఘ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ వల్ల పెద్ద వాళ్లకే లాభమవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందన్నారు. అందువల్ల సింగరేణిలో అండర్‌ గ్రౌండ్‌ మ్యాన్యువల్‌ గనులను తెరవాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ.. ప్రభుత్వానికి రూ.30వేలు సంపాదించి పెడుతున్నారని కానీ వారికిచ్చే వేతనం చాలా తక్కువగా ఉంటోందన్నారు. కార్మికులకు భరోసా క ల్పించేందుకు దసరా తర్వాత సింగరేణి యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంస్థ బ్రిటిష్‌ హయాంలో కార్మికుల కోసం పో రాడేందుకు సుభా్‌షచంద్రబోస్‌ ఏర్పాటుచేశారని, కార్మిక సంక్షేమమే ధ్యే యంగా హెచ్‌ఎంఎ్‌సతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు.

బీఆర్‌ఎ్‌సపైనే ప్రత్యేక దృష్టి ఎందుకు..?

’’సీఎం రేవంత్‌ ఓ మాట మాట్లాడితే, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతున్నారు. బండి సంజయ్‌కు ఈటల వార్నింగ్‌ ఇచ్చినా కూడా దానిపై చర్చలేదు. ఇలా అవతలి పార్టీల్లో కూడా చాలా సమస్యలున్నాయి.’’ అవన్నీ వదిలేసి బీఆర్‌ఎ్‌సపైనే ప్రత్యేక దృష్టి ఎందుకంటూ కవిత అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేద ంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.

Updated Date - Aug 11 , 2025 | 05:01 AM