డీట్ యాప్‌పై యువతకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:25 AM
ఏఐ ఆధారిత డీట్ (డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌పై నిరుద్యోగ యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో డీట్ యాప్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు
కరీంనగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఏఐ ఆధారిత డీట్ (డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌పై నిరుద్యోగ యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో డీట్ యాప్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, సంస్థలు, గ్రానైట్స్, రైస్ మిల్లులు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యే విధంగా చూడాలన్నారు. ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందారన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర కళాశాలల ఫైనల్ ఇయర్ విద్యార్థులు, యువత, స్కిల్ వర్కర్లు ఈ యాప్‌లో నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎంప్లాయర్లు తమకు కావాల్సిన అర్హత కలిగిన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి ఉపాధి మార్గాలు లభిస్తాయని తెలిపారు. సమావేశంలో మెప్మా పీడీ వేణుమాధవ్, ఎన్‌వైకే కో-ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సాల్మన్ రాజు