Share News

పేదలకు వైద్యం చేసేందుకు యువ డాక్టర్లు ముందుకు రావాలి

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:40 AM

రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్‌ విద్యను పూర్తిచేసిన యువ వైద్యులు పేదలకు వైద్యం అందించేం దుకు ముందుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

పేదలకు వైద్యం చేసేందుకు యువ డాక్టర్లు ముందుకు రావాలి

వేములవాడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్‌ విద్యను పూర్తిచేసిన యువ వైద్యులు పేదలకు వైద్యం అందించేం దుకు ముందుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవా రం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుప త్రిలో ఇన్‌చార్జికలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో సీఎస్సార్‌ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడారు. జిల్లాలో డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ కోసం కలెక్టర్‌ 89 వైద్య పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారని, యువ డాక్టర్లంతా దరఖాస్తు చేసుకుని ఉద్యోగా లు పొందాలని కోరారు. కరీంనగర్‌ నుంచి వేములవాడ ఎంతోదూరం కూడా లేదని, ఉద్యో గాల్లో చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సేవ చేయాలని కోరుతున్నామన్నారు. అర్బన్‌ నక్సల్స్‌ మాయలో పడి మావోయిస్టులు మోస పోయి ప్రాణాలు కోల్పోవద్దన్నారు. అర్బన్‌ నక్స ల్స్‌ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారని, ప్రభుత్వంతో అర్బన్‌ నక్సల్స్‌ కు మ్మక్కై నామిటెడ్‌ పోస్టులు, కమిషన్‌లు, పదవు లు అనుభవిస్తున్నారని, వాళ్ల మాయమాటలకు లోనైన అమాయక దళిత, గిరిజనులు మాత్రం తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ ప్రణా లు కోల్పోతున్నారని తెలిపారు. భారతదేశంలో జాతీయ జెండాను ఎగరవేయవద్దని, నల్ల జెం డాలను ఎగరవేయాలని నక్సల్స్‌ చెబుతున్నార ని, నల్ల జెండాను పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో ఎగరవేయాలని చెప్పాలని సూచించారు. బుల్లె ట్‌ను నమ్ముకుని ఏమి సాధించలేరని, సాధించ బోరని, ఇప్పటి వరకు ఏమి సాధించారని ప్రశ్నించారు. నక్సల్స్‌ బుల్లెట్లను నమ్ముకుంటే.. మోదీ బ్యాలెట్‌ను నమ్ముకుని మూడుసార్లు విజయవంతంగా అధికారంలోకి వచ్చామని తెలిపారు. తుపాకులు బార్డర్‌లో జవాన్‌ వద్ద, పోలీసుల వద్ద తప్ప మరేవ్వరి వద్ద ఉండ టానికి వీలులేదనేది, హోంశాఖ మంత్రి అమిత్‌ షా దాన్ని సహించబోరని అన్నారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని అమిత్‌షా నిర్ణయం తీసుకున్నాడ ని, నక్సల్స్‌కు మరో నాలుగు నెలలు గడువు ఉందని, తుపాకులను వీడి జనజీవన స్రవం తిలో కలువాలని పిలుపునిచ్చారు. జనంలో కలిసి సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహిం చాలని, నక్సల్స్‌ సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తుపాకీ పట్టుకుని చర్చలు జరుపు తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని, తుపాకీ వీడాల్సిందేనని, జనవీజన స్రవంతిలో కలవా ల్సిందే అని, తుపాకీ వదిలి జనంలోకి వచ్చే వారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని సూచించారు. వారి వెంట ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ పెంచలయ్య, బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు, ఎర్రం మహేష్‌, రాపెల్లి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:40 AM