యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:09 AM
యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని యాదవ సంఘం మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సాగని కొమురయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని యాదవ సంఘం మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సాగని కొమురయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని యాదవులను ఏకం చేయడం కోసం సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన యాదవ సంఘం సమావేశంలో యాదవులు ఆదివారం రోజు న మాంసం, మద్యం తీసుకోకూడదని ఏకగ్రీవ తీర్మానం చేసి సభ్యుల ప్రతిజ్ఞ చేశామన్నారు. ఈ అంశంను ఉమ్మడి జిల్లాలో ముందుకు తీసుకుపోతామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కలి గించడం కోసం నాలుగు జిల్లాల్లోని యాదవులందరికి సంఘం పక్షాన ఈనెల 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక్కరోజు శిక్షణలు ఉంటాయని యాదవ సోద రులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాదవులు రాజకీయం గా వెనకబడి ఉన్నారని ఐక్యతతో హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ సమావే శంలో సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతియాదవ్, నాయకులు రవీందర్‌యాదవ్, మల్లేష్‌యాదవ్, మహేంధర్ యాదవ్, భాస్కర్‌యాదవ్, కృష్ణకాంత్‌యాదవ్, రా ములుయాదవ్, వేణుగోపాల్‌యాదవ్, పరుశరాములు యాదవ్, కొమరయ్యయా దవ్, కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.