కన్నుల పండువగా హనుమంతు వైభవ పూజ
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:02 AM
హనుమాన్ దీక్షాపరుల భజన లతో హనుమంతు వైభవ పూజ కన్నుల పండువగా జరిగింది.

సిరిసిల్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : హనుమాన్ దీక్షాపరుల భజన లతో హనుమంతు వైభవ పూజ కన్నుల పండువగా జరిగింది. ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పాల్గొన్నారు. బుధవారం సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో హనుమాన్ దీక్షాదారులతో హనుమంతు వైభవ పూజ నిర్వహించారు. చక్రవర్తి సంకీర్తనచార్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వైభవ పూజ ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పూజలో పాల్గొనడంతో పాటు దీక్షాదారులతో కలిసి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్ వేములవాడ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, చేపూరి నాగరాజు, అక్కరాజు శ్రీనివాస్, అగ్గిరాములు, ఎనుగు మనోహర్‌రెడ్డి, శరత్‌రావు, రాఘవరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.