Share News

సమస్యల పరిష్కారానికి కృషి..

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:33 AM

వయోవృద్ధులు పిల్లలు ఆదరించక పోతే అర్జీలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి..

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : వయోవృద్ధులు పిల్లలు ఆదరించక పోతే అర్జీలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌, గీత ప్రచార సేవా సమి తి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం, దసరా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా ఆర్డీవో వెంకటేశ్వర్లును తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌, గీత ప్రచార సేవా సమితి సభ్యులు శాలువలతో సన్మానించారు. అనంతరం ఆర్డీవో తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌, గీత ప్రచార సేవా సమితి సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్లు, వయోవృద్ధులను వారి పిల్లలు ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌, గీత ప్రచార సేవా సమితి, చిన్మయ మిషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 12:33 AM