Share News

క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:24 AM

క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన క్రిస్టియన్‌ మైనార్టీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి కృషి
క్రిస్టియన్‌ మైనార్టీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన క్రిస్టియన్‌ మైనార్టీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. క్రిస్టియన్లు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులం సర్టిఫికెట్ల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ హాల్స్‌, చర్చిల నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. క్రిస్టియన్‌ శ్మశానవాటికలకు సంబంధించిన భూమి కేటాయింపులను వేగవంతం చేయాలని తెలిపారు. విద్యా, ఉపాధి రంగంలో క్రిస్టియన్లు రాణించాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో మెలగాలని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కృషిచేస్తామన్నారు. అర్హులైన మైనార్టీలకు సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్వో, ఇన్‌చార్జి మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, క్రిస్టియన్‌ మైనార్టీ సంఘాల ప్రతినిధులు, ఫాస్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:24 AM