Share News

మహిళల అభ్యున్నతికి కృషి..

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:15 AM

మహిళల అభ్యున్నతి కోసం కాం గ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మహిళల అభ్యున్నతికి కృషి..

వేములవాడ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మహిళల అభ్యున్నతి కోసం కాం గ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన మహిళ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని, అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించి మహి ళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళల కు మేలు జరిగితే మళ్లీ రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లులకు పెద ్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 20 వేల పైచిలుకు కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్‌ పంప్‌, ధాన్యం కొనుగోలు, రైస్‌ మిల్‌ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్‌ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు వారు ఆర్థికంగా ఎదగాలని మైక్రో ఎం టర్‌ప్రైజేషన్‌, మహిళా శక్తి స్టిచ్చింగ్‌ సెంటర్స్‌, ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్‌లో, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, డైరీ యూనిట్స్‌ వంటి వాటిని ఏర్పాటు చేయడం కోసం బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలను మంజూరు చేశామని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ ద్వారా 20084కోట్లు, 2025-26 సంవత్సరా నికి 58కోట్లు బ్యాంకు లింకేజీ అందజేయడం జరిగిందని తెలిపారు. 4350 సం ఘాలకు 5 కోట్ల 72 లక్షల వడ్డీలేని రుణాలను మంజూరుచేశామని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యురాళ్లకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లోన్‌ బీమా, ప్రమాద బీమా స్కీం వలన ఎంతో మందికి ప్రయోజనం చేకూరు తుందని తెలిపారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికీ ఆశీర్వాదాలు అందజేయాలని ఆది శ్రీనివాస్‌ కోరారు.

Updated Date - Sep 15 , 2025 | 12:15 AM