ఏడీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:58 AM
తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్‌టైల్ పార్కు పవర్‌లూం కార్మికులు ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
- కొనసాగుతున్న సమ్మె
తంగళ్లపల్లి, ఆగష్టు 22 (ఆంఽధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి టెక్స్‌టైల్ పార్కు పవర్‌లూం కార్మికులు ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శుక్రవారం సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. పవర్‌లూం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొడం రమణ అధ్వర్యంలో కార్మికులు ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కూలీ పెంపు తదితర సమస్యలతో కూడిన వినతిపత్రం ఏడీకి సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో ప్లాట్లను 20 సంవత్సరాల క్రితం కోనుగోలు చేసి ఇప్పటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయని, పరిశ్రమలను ప్రారంభించి మూసి వేసిన వారి ప్లాట్లను రద్దు చేసి పరిశ్రమలు నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించే వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. శనివారం పార్కు ప్రధాన ద్వారం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్మికులు పెద్ద సంఖ్యలో హజరు కావాలని కోరారు. కార్యక్రమంలో టెక్స్‌టైల్ పార్కు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, శ్రీకాంత్, వేణు, సంపత్, ఆంజనేయులు, కనకయ్య, వరప్రసాద్, శ్రీనివాస్, రాజు, వెంకటేశం, అంబదాస్, నర్సయ్య, రవీందర్, సత్యనారయణ, భాస్కర్, ప్రశాంత్, మహేశ్ తదితరలు పాల్గొన్నారు.
- కార్మికులతో చర్చలు విఫలం..
సమ్మె చేస్తున్న కార్మికులతో శుక్రవారం చేనేత జౌళీశాఖ ఏడీ రాఘవులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వారం రోజులలోపు ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి యజమానులతో చర్చలు జరిపించి కూలీ పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని కార్మికులు సమ్మె విరమించాలని ఏడీ కోరారు. ముందుగా చర్చలు జరిపి కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. ఆందోళన ఉధృతం చేస్తామని నేడు వంట వార్పు చేయనున్నట్లు ప్రకటించారు.