గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:45 AM
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రా మాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యం గా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని శాస నసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించా రు.
వేములవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రా మాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యం గా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని శాస నసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించా రు. పట్టణంలోని మల్లారం రోడ్డులో గల ఫంక్షన్ హాల్‌లో బుధవారం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఉంటుం దని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం నెలకొందని, దాన్ని ఓటు రూపంలో మార్చేందుకు గ్రామీణస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాల్గొన్నారు.