Share News

సమన్వయంతో పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:08 AM

వేముల వాడ నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సమన్వయంతో పనులు పూర్తి చేయాలి

వేములవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో మున్సిపల్‌కార్యాలయంలోని సమా వేశ మందిరంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లోఓల్టేజ్‌ సమస్య పరిష్కారానికి, సరఫరాలో ఇబ్బందు లు దూరం చేసేందుకు హైఓల్టేజీ సబ్‌స్టేషన్‌లను మం జూరుచేశారు. అలాగే సబ్‌స్టేషన్ల పనితీరుపై ఆరా తీశా రు. రైతు విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి 50 ఎకరాల భూమి గుర్తించాలని, తాత్కాలిక భవనం కేటాయించా లని సూచించారు. రూ.10 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశామని, సామాజిక భవనాలు, తదితర వాటికి నిధులను కేటాయించామన్నారు. రూ. 15 కోట్లతో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా మంజూరు చేయించి, పనుల జాతరలో భాగంగా గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, నిర్మాణ శంకుస్థాపన చేసిన పనుల పురోగతిపై ఆరా తీశారు. బీటీ రోడ్లు, సీసీరోడ్ల నిర్మాణాల పనులు ప్రారం భం కాకుండా ఉన్న వాటిని యుద్ధప్రాతిపదికన చేపట్టా లని సూచించారు. మలవాగు వంతెనకు 2015లో శంకు స్థాపన చేసి, పనులు ప్రారంభించకుండా ఉంచారని, ఈ మధ్య తిరిగి శంకుస్థాపన చేశామని వివరించారు. వంతెన నిర్మాణం కోసం రూ.6.90కోట్లు భూసేకరణకు కేటాయించామన్నారు. పనులు ప్రారంభించి వచ్చే వర్ష కాలంలోగా వంతెన నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశిం చారు. భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు రహదారుల మరమ్మతు పనులపై ఆరా తీశారు. దెబ్బ తిన్న రహదారులు, కల్వర్టులు, వంతెనలకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత మరమ్మతులు చేప ట్టాలని ఆదేశించారు. మోత్కురావుపటే-చందుర్తి రోడ్డుకు అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చిందని, రూ.24 కోట్ల తో రోడ్డు పనులు పూర్తి చేయనున్నామని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 10 చెరువుల పను లు మొదలుకాగా 7 పూర్తి అయ్యాయన్నారు. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఎకరాల భూమి సాగులోకి తీసుకువ చ్చేందుకు రూ.325కోట్ల నిధులు మంజూరు అయ్యాయ ని తెలిపారు. పనులు పూర్తి అయితే 45 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయన్నారు. జిల్లాలో ఆయా ప్రాజెక్టులు పూర్తిచేస్తే దాదాపు లక్షా యాబై వేల ఎకరా ల భూమి సాగులోకి వస్తుందన్నారు. మల్కపేట ప్రాజె క్టు కోసం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి మొత్తం 700 ఎకరాల భూమి అవసరమని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిషోర్‌ కుమార్‌ ప్రభుత్వ విప్‌ దృష్టికి తీసుకురావడంతో, ప్రతిపాధనలు పంపాలని ప్రభుత్వ విప్‌ సూచించారు.

ముమ్మరంగా ఇందిరమ్మ ఇళ్ల పనులు..

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. 1957 ఇళ్ల నిర్మాణాలకు మా ర్కింగ్‌ చేశామని, 1482 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, 12 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని గృహనిర్మాణ శాఖ అధికారులు సమావేశంలో విప్‌ దృష్టికి తీసుకువ చ్చారు. మండలాల వారిగా ఇండ్ల నిర్మాణాల పురోగతిపై విప్‌ ఆరా తీశారు.

రాజన్న ఆదాయం రూ.186 కోట్లు..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రతి యేటా రూ.186కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వ విప్‌ అన్నారు. రూ. 150 కోట్లతో ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. భీమేశ్వర ఆలయంలో రూ. 3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామ ని వెల్లడించారు. రాజన్న ఆలయం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశా మని తెలిపారు.

తాగునీటి సమస్య లేకుండా చూడాలి..

వేములవాడ పట్టణంతో పాటు ఆయా మండాల పరిధిలో మిషన్‌ భగీరథ వాటర్‌ సమస్యలు లేకుండా చూడాలని విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులకు సూచించారు. మిషన్‌ భగీరథలో భాగంగా త్రాగు నీరు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అగ్రహారంలో వున్న మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ప్లాంట్‌ నిర్వహణ పై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాస్తవాలను జిల్లా యంత్రాంగానికి సూచించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమిస్టి విజయం కోసం కృషి చేయాలని కోరారు.

పనులు వేగంగా పూర్తి చేయాలి..

- ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులకు స్థలాలను వెంటనే గుర్తించాలని సూచించారు. సమన్వయంతో పని చేస్తూ ముందుకు వెళ్లాలని, గడువులోగా పనులు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాధా బాయి, డీఆర్‌డీవో శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికా రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:08 AM