Share News

ఆర్టీసీలో మహిళా శక్తి

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:19 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళా సంఘాలచే పెడుతున్న అద్దె బస్సులతో అటు ఆర్టీసీకి, ఇటు మహిళా సంఘాలకు ప్రయోజనాల్ని చేకూరుస్తు న్నది.

ఆర్టీసీలో మహిళా శక్తి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళా సంఘాలచే పెడుతున్న అద్దె బస్సులతో అటు ఆర్టీసీకి, ఇటు మహిళా సంఘాలకు ప్రయోజనాల్ని చేకూరుస్తు న్నది. బస్సులు కొనుగోలుతో ఆర్టీసీకి ఆర్థిక భారం తప్పగా, మహిళా సంఘాలకు లాభాన్ని చేకూరుస్తు న్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పనులను గుర్తించి తద్వారా ఉపాధి పొందేందుకు గాను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. అందులో భాగంగా మహిళా క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, కిరాణషాపులు, తదితర ఏర్పాటు చేయిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీలో అద్దె బస్సు లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 151 అద్దె బస్సులను ఆర్టీసీకి మండల మహిళా సమాఖ్యల ఆధ్వ ర్యంలో కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాలోని 9 మండలాల నుంచి అద్దె బస్సు లను ఆర్టీసీలో పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌక ర్యం కల్పించింది. దీంతో బస్సుల్లో రద్దీ పెరగడంతో తదనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీకి భారంగా మారింది. ఇప్పటికే ఆర్టీసీలో అద్దె బస్సుల వినియోగం కొనసాగుతున్నది. పైవ్రేట్‌ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే బదులు మహిళా సంఘాల చే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో 600 బస్సులను అద్దెకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ ఏడాది మార్చి 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేయగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న కొన్ని బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారం భించారు. మే 20వ తేదీ నాటికి మొత్తం 151 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చారు. బస్సుల కొనుగోలుకు ప్రభు త్వం పేదరిక నిర్మూలన సంస్థ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫండ్‌ నుంచి 30 లక్షల రూపాయలు మండల సమాఖ్యలకు అందజేయగా, వారు మరో 6 లక్షలు కలు పుకొని మొత్తం 36 లక్షల రూపాయలను ఆర్టీసీకి అందజేశారు. ఆర్టీసీ బస్సును కొనుగోలు చేయడంతో పాటు డైవ్రర్‌, కండక్టర్లను వారే సమకూర్చుకుని, డీజిల్‌ ఖర్చు, బస్సు నిర్వహణ ఖర్చులు భరించుకుని, అద్దె కింద నెలకు 69,468 రూపాయల డబ్బులను మండల సమాఖ్యలకు ఏడు సంవత్సరాలపాటు అందజేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఆ బస్సులు ఆర్టీసీ సొంతం అవుతాయి.

ఫ జిల్లా నుంచి ఆర్టీసీలో తొమ్మిది బస్సులు

ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, ముత్తారం, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, అంతర్గాం, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన బస్సులను గోదావరిఖని, మంథని డిపోలో అద్దెకు పెట్టారు. మంథని డిపోలో 3 బస్సులు, గోదావరిఖని డిపోలో 6 బస్సులను ఏర్పాటు చేశారు. తద్వారా ఒక్కో బస్సుపై నెలకు 69.468 రూపాయల చొప్పున ఏడాదికి 8 లక్షల 33 వేల 616 రూపాయల ఆదాయం సమకూరనున్నది. ఏడు సంవ త్సరాలకు 58 లక్షల 35 వేల 312 రూపాయల ఆదా యం రానున్నది. ఈ విధంగా సమకూరిన ఆదాయంతో మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలకు రుణాల రూపంలో తక్కువ వడ్డీకే ఇవ్వనున్నారు. ఆ డబ్బుతో మహిళలు స్వయం ఉపాధి పనులు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఉన్న స్థలాన్ని పెట్రోల్‌ బంక్‌కు కేటాయించినట్లు తెలుస్తున్నది. త్వరలోనే వాటి పనులను ఆరంభించనున్నారు. మే 20 నుంచి జిల్లాలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా జూన్‌ 20వ తేదీ నాటికి ఈఎంఐ కింద తొమ్మిది బస్సులకు 6 లక్షల 25 వేల 212 రూపాయలు మహిళా సంఘాలకు విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:19 AM