మహిళా సంఘాలు వ్యాపారంలో రాణించాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:44 AM
ఇందిరా మహి ళాశక్తి పథకం కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా మహిళల సంఘాలు ఆర్థిక పురోగతి సాధించడం తోపాటు రైతులకు ఉత్తమ సేవలు అందించాలని చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
బోయినపల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహి ళాశక్తి పథకం కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా మహిళల సంఘాలు ఆర్థిక పురోగతి సాధించడం తోపాటు రైతులకు ఉత్తమ సేవలు అందించాలని చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ఇందిరా మహిళా ద్వారా బోయినపల్లి మం డలం కేంద్రంలో ధరిత్రి మహిళా సమాఖ్య అలాగే విలా సాగర్ గ్రామంలో విలాసాగర్ గ్రామైక్య సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన ఎరువుల, విత్తనాల దుకాణాలను చొప్పదం డి ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహి ళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు ఇతర స్వయంఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. అనంత రం కలెక్టర్ మాట్లాడారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్‌మిల్లులు, పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రైతన్నలకు ఉత్తమ సేవలు అందించేలా మహిళా సంఘాలకు ఎరువులు, పురుగు మం దుల దుకాణాలు ఏర్పాటుచేసుకునే అవకాశం కల్పించామని తెలి పారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 3 దుకాణాలు ప్రారంభించామని వివరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమమని వెల్లడిం చారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని పిలు పునిచ్చారు. మహిళా సంఘాల బాధ్యులు ఐక్యంగా తమ దుకాణా లను సమర్థవంతంగా నిర్వహించి ఆర్థికంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసా య అధికారి అఫ్జల్ బేగం, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏవో ప్రణీత, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.