మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:11 AM
మహిళలందరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా , జాతీయ వైద్యుల దినోత్సవం, ఆశా డే కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు.
మానకొండూర్, జూలై 1: మహిళలందరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా , జాతీయ వైద్యుల దినోత్సవం, ఆశా డే కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రతి రోజు పాలు, గ్రుడ్లు, ఆకు కూరలు, కూరగాయలు తినాలని అన్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అంతకు ముందు ఆసుపత్రిలోని సిబ్బంది హాజరుపట్టిక, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్‌రూం, ఫార్మసీ గదులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి వేగవంతంగా నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. గ్రామపంచాయితీ ప్రక్కన గత నర్సరీని సందర్శించి ఎన్ని రకాలుఅందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌వో సుఽధారాజేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాజిదా అతహరి, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో కిరణ్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యుడు ఎండీ సల్మాన్, సీహెచ్‌వో రాజునాయక్ పాల్గొన్నారు.