మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:16 AM
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆకు కూరగాయలు, తృణ ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.
కరీంనగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆకు కూరగాయలు, తృణ ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో 50 వేల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామన్నారు. ఈ పరీక్షలను ఆరు నెలలకు ఓసారి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ఏడాది కాలంలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు నాలుగు ఉచిత వైద్య పరీక్షలతోపాటు టీఫా స్కానింగ్ చేయిస్తున్నామని తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్‌లో చేరి పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత, వైద్య ఆరోగ్య, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.