Share News

మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:02 AM

మహిళలు తమను తాము కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పిలుపునిచ్చారు.

మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి
స్త్రీ శక్తి దివస్‌ సందర్భంగా మిషన్‌ సాసి కార్యక్రమంలో మాట్లాడుతూన్నా జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

గణేశ్‌నగర్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళలు తమను తాము కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ఎస్సారార్‌ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి బుధవారం స్త్రీ శక్తి దివస్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ పమేలా సత్పతి హజరై మాట్లాడుతూ భారతదేశం ఎందరో వీరులను, వీర మాతలను కన్న తల్లి ఆన్నారు. 18వ శతాబ్దంలో దేశ స్వాతంత్రం వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారని అన్నారు. అటివంటి వారిలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరని తెలిపారు. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించి వీరమరణం పొందారన్నారు. అనంతరం ప్రాంత సంఘటన మంత్రి లవన్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అసమాన ధైర్య సాహసాలు చూపారన్నారు. ఆమె త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మర్చిపోదని తెలిపారు. ఆమె స్ఫూర్తితోనే నేతాజీ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో మహిళావిభాగానికి ఝాన్సీ రెజిమెంట్‌ అని పేరు పెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రెటరీ మల్యాల రాకేష్‌, విభాగ్‌ కన్వీనర్‌ అజయ్‌, జిల్లా కన్వీనర్‌ విష్ణు, కిరణ్మయి, ప్రణీత్‌, యోగేష్‌, నందు, విగ్నేష్‌, అశ్విని, అక్షయ, సాయి నిఖిల, కావ్య, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:02 AM