మహిళలు శుక్రవారం సభకు హాజరు కావాలి..
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:27 AM
ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పని సరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు
భగత్‌నగర్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పని సరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. శుక్రవారం కొత్తపల్లి సెక్టార్, రాజీవ్ గృహకల్ప అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఏమైనా సమస్యలుంటే సభలో తెలపాలన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలకు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత పరీక్షలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయ న్నారు. ఈ సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ అరుణ సతీష్, రాజేందర్ పాల్గొన్నారు.