Share News

మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:48 AM

మహిళలు వ్యాపారం తో స్వయంసమృద్ధి సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కోరారు.

మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలి

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : మహిళలు వ్యాపారం తో స్వయంసమృద్ధి సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌లో మహా లక్ష్మీ గ్రామైక్య మహిళా సమైక్య(మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఎరువుల దుకాణాన్ని శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజ కవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహి ళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డెయిరీ యూనిట్‌లు, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయంఉపాధి యూనిట్లను ఇచ్చా మన్నారు. ఇటీవల పెట్రోల్‌బంక్‌ సైతం ప్రారంభించామన్నారు. త్వర లో ఇందిరా మహిళాశక్తి జిల్లాలోని మహిళా సంఘాలకు రైస్‌మిల్లు లు, సోలార్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు. జిల్లాలో మొత్తం 23దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వ్యాపార అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని స్వ యంసమృద్ధి సాధించి ప్రజలకు మద్దతుగా నిలవాలని అకాంక్షించారు. రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతు న్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కాకుండా ఇక్కడే కొనుగో లు చేసి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ము ల స్వరూప తిరుపతిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, తాజా మాజీ కౌన్సిలర్‌ చేన్నమనేని కీర్తి కమలాకర్‌రావు, లింగంపల్లి సత్యనా రాయణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగ కిరణ్‌కుమార్‌, గంభీరావు పేట ప్రశాంత్‌గౌడ్‌, వార్డు అధ్యక్షుడు మంగ ప్రశాంత్‌, గుగ్గిళ్ల తిరుపతి గౌడ్‌, భరత్‌, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ఝా కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కాం గ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా పరిశీలించారు. ఈసందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉందని గ్రామానికి చెందిన లబ్ధిదారులతోపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగ కిరణ్‌కుమార్‌, మంగ ప్రశాంత్‌లు కలెక్టర్‌కు వివరించారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ సిరిసిల్ల తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి పెద్దూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకకు వేబిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో హౌసింగ్‌ పీడీ శంకర్‌, తాజా మాజీ కౌన్సిలర్‌లు చేన్నమనేని కీర్తి కమలాకర్‌రావు, లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:48 AM