Share News

నామినేటెడ్‌ పదవుల్లో మహిళా నేతలకు అవకాశం ఇవ్వాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:03 AM

నామినేటెడ్‌ పదవుల్లో మహిళా నాయకులకు అవకాశం ఇవ్వాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

  నామినేటెడ్‌ పదవుల్లో మహిళా నేతలకు అవకాశం ఇవ్వాలి
మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు

- మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు

కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల్లో మహిళా నాయకులకు అవకాశం ఇవ్వాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సునీతరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్‌ బలోపేతం కోసం నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత సాధన కోసం శక్తివంచన లేకుండా పోరాడాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడానికి కష్టపడ్డ మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలను గుర్తించి జిల్లాస్థాయిలో వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్‌ను కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:03 AM