Share News

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:37 PM

గెలుపోటములను సమానంగా స్వీకరించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు అన్నారు.

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

సిరిసిల్ల, డిసెంబరు 31 ఆంధ్రజ్యోతి): గెలుపోటములను సమానంగా స్వీకరించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రభుత్వ జూని యర్‌ కళాశాల మైదానంలో మదీనా యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన కేటీఆర్‌ కప్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ ఆటను తిలకించి విజేతలకు బహుమతులను అందించారు. ఫైనల్‌ పోటీలో అన్నారం క్రికెట్‌ టీం విన్నర్‌గా నిలిచింది. కెప్టెన్‌ గుర్రం శ్రీనివాస్‌, రన్నర్‌గా మహమ్మద్‌ సత్తార్‌ టీం కెప్టెన్‌ మహమ్మద్‌ మన్సూర్‌లు ట్రోపీలను కేటీఆర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. విన్నర్‌ టీంకు రూ.20వేలు, రన్నర్‌ టీంకు రూ10వేల నగదుతో పాటు ట్రోపీలను అందజేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్‌ బ్యాటింగ్‌ చేయగా టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు బౌలింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు జిందం చక్రపాణి, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సత్తార్‌, మదీనా యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్‌ ఉస్మాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ సీనియ ర్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, మల్లారెడ్డి, అన్నారం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌ విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హాస్టల్‌ విద్యార్థులతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు మాజీ మంత్రి కే తారక రామారావు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. బుధ వారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వే డుకల్లో కేటీఆర్‌ విద్యార్థులతో సందడిగా గడిపా రు. కేక్‌ కట్‌ చేయించి తినిపించారు.

బల్దియా ఎన్నికలపై మార్గనిర్దేశం

సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో అన్సురించాల్సిన వ్యూహం, నాయ కులు మధ్య సమన్వయం వంటి అంశాలపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు మార్గనిర్దేశం చేశారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, మాజీ కౌన్సి లర్లతో సమావేశం అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రా నున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు విషయాలపై చర్చించా రు. ఈసందర్భంగా పలు సంస్థలకు నూతన సంవత్సరం క్యాలెండ ర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమలో టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, టెక్స్‌టైల్‌ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ ఎస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిందం కళ మాజీ వైస్‌ చైర్మన్‌ మంచే శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:37 PM