Share News

వరుణుడు కరుణించేనా..?

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:16 AM

జగిత్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూన్‌ నెలలో లోటు వర్షపాతం నమోదైంది. మేలో భారీ వర్షాలు కురవడంతో రైతులు ఏరువాకకు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్‌లో చినుకు జాడ లేక అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశారు. ప్రతి రోజూ మబ్బులు పట్టినా వర్షం కురవలేదు. దీంతో కొన్ని చోట్ల విత్తనాలు మొలవక కొందరు రైతులు రెండోసారి వేశారు. కాగా జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తేనే పాడి పంటలు బాగుంటాయని రైతులు ఎదురుచూస్తున్నారు.

వరుణుడు కరుణించేనా..?

-జూన్‌లో 23శాతం లోటు వర్షపాతం

-చెరువులు, ప్రాజెక్టుల్లోకి చేరని వరదనీరు

-జూలై, ఆగస్టుపైనే రైతుల ఆశలు

జగిత్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూన్‌ నెలలో లోటు వర్షపాతం నమోదైంది. మేలో భారీ వర్షాలు కురవడంతో రైతులు ఏరువాకకు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్‌లో చినుకు జాడ లేక అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశారు. ప్రతి రోజూ మబ్బులు పట్టినా వర్షం కురవలేదు. దీంతో కొన్ని చోట్ల విత్తనాలు మొలవక కొందరు రైతులు రెండోసారి వేశారు. కాగా జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తేనే పాడి పంటలు బాగుంటాయని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024 వానాకాలం సీజన్‌లో 4,13,974 ఎకరాల్లో, 2024-25 యాసంగి సీజన్‌లో 3,87,778 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం 2025 వానాకాలం సీజన్‌లో 4,15,169 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు.

ఫ11 మండలాల్లో లోటు..

జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున సాధారణ వర్షపాతం 153.4 మి.మీ. కురవాల్సి ఉండగా 121.1 మి.మీ. మాత్రమే కురిసింది. మండలాల వారీగా పరిశీలిస్తే బీర్‌పూర్‌, ధర్మపురి, బుగ్గారం, మేడిపల్లి, మెట్‌పల్లి, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లో లోటు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో పంటలు సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 40 శాతానికి పైగా సాగు మొదలైంది. ఇందులో అధికంగా వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. వానలు కురవాలని వరుణ దేవుడికి రైతులు పూజలు చేస్తున్నారు. మొదట్లో వర్షాలు బాగా కురవడంతో సాగు బాగా జరిగిందని, ప్రస్తుతం వర్షాలు కురిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్‌ పేర్కొన్నారు.

ఫజిల్లాలో తక్కువగానే వర్షం...

జిల్లాలో జూన్‌లో 5న 1.8 మి.మీ., 9వ తేదీన సగటున 30.5 మి.మీ., 10వ తేదీన 3.1 మి.మీ., 11వ తేదీన 8 మి.మీ., 12వ తేదీన 12.8 మి.మీ., 13వ తేదీన 11.7 మి.మీ., 14వ తేదీన 1 మి.మీ., 15వ తేదీన 0.5 మి.మీ., 17వ తేదీన 2.7 మి.మీ., 20వ తేదీన 2.1 మి.మీ., 21వ తేదీన 0.9 మి.మీ., 22వ తేదీన 0.4 మి.మీ., 23వ తేదీన 2.4 మి.మీ., 25వ తేదీన 8.2 మి.మీ., 26వ తేదీన 22.4 మి.మీ., 27వ తేదీన 5.8 మి.మీ., 30వ తేదీన 6.2 మి.మీ.ల వర్షం కురిసినట్లు రికార్డులో నమోదైంది. అదేవిదంగా జిల్లాలో మే మాసంలో 20.4 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 180.2 మి.మీ.ల వర్షం కురిసింది.

వానల కోసం ఎదురుచూపులు

-గడ్డం శ్రీనివాస్‌ గౌడ్‌, రైతు, యామాపూర్‌ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మేలో ముందస్తుగా వర్షాలు కురవడంతో మురిసిపోయాం. జూన్‌ మాసంలో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నాం. సకాలంలో వర్షాలు కురిస్తేనే పంటలు బాగా పండుతాయి.

ముందస్తుగా మురిపించాయి

-గాజుల శ్రీనివాస్‌, రైతు, బట్టపల్లి గ్రామం, సారంగపూర్‌ మండలం

వర్షాలు మే నెలలో ముందస్తుగా మురిపించాయి. కానీ కురవాల్సిన రోజుల్లో వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు సాగు చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి పంటలు పండుతాయి.

---------------------------------------------------------------------

మండలాల వారీగా వర్షపాతం (మి.మీ.లో)

---------------------------------------------------------------------

మండలం - కురిసింది - కురవాల్సింది - స్థితి

---------------------------------------------------------------------

ఇబ్రహీంపట్నం - 132.8 - 159.6 - సాధారణం

మల్లాపూర్‌ - 133.2 - 138.3 - సాధారణం

రాయికల్‌ - 142.2 - 149 - సాధారణం

బీర్‌పూర్‌ - 98.6 - 183.1 - లోటు

సారంగపూర్‌ - 150.1 - 153.7 - సాధారణం

ధర్మపురి - 108.3 - 146.4 - లోటు

బుగ్గారం - 89.3 - 149.4 - లోటు

మేడిపల్లి - 111.4 - 138.7 - లోటు

కోరుట్ల - 155.5 - 146.1 - సాధారణం

మెట్‌పల్లి - 119.7 - 166.7 - లోటు

కథలాపూర్‌ - 161.1 - 165.2 - సాధారణం

కొడిమ్యాల - 105.5 - 131.8 - లోటు

మల్యాల - 106 - 144.7 - లోటు

పెగడపల్లి - 78.9 - 149.8 - లోటు

గొల్లపల్లి - 95.2 - 157.8 - లోటు

వెల్గటూరు - 91 - 153.3 - లోటు

ఎండపల్లి - 96.2 - 152.3 - లోటు

బీమారం - 155 - 137.6 - సాఽధారణం

జగిత్యాల రూరల్‌ - 165.6 - 170.3 - సాధారణం

జగిత్యాల - 127.2 - 172.6 - లోటు

---------------------------------------------------------------------

జిల్లా సగటు - 121.1 - 153.4 - లోటు

---------------------------------------------------------------------

Updated Date - Jul 03 , 2025 | 01:16 AM