నంబాల స్థానం మల్లోజులకు దక్కేనా!
ABN , Publish Date - May 23 , 2025 | 01:15 AM
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు బుధవారం అబూజ్ మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరగడంతో ఆయన స్థానం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సాహు, అభయ్ దక్కుతుందా అనే చర్చ ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో మొదలైంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు బుధవారం అబూజ్ మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరగడంతో ఆయన స్థానం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సాహు, అభయ్ దక్కుతుందా అనే చర్చ ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీసినట్లయ్యింది. మావోయిస్టుల ప్రధాన స్థావరాలైన అబూజ్‌మఢ్‌ను చేధించిన భద్రతా దళాలు మావోయిస్టుల కోసం అధునాతన ఆయు ధాలు, డ్రోన్లను ఉపయోగిస్తూ జల్లెడ పడుతున్నాయి. ఏడాది కాలంగా సాగుతున్న కగార్‌ను నిలిపి వేయా లని ప్రజాసంఘాలు గొంతెత్తి మొత్తుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమి మాట్లాడడం లేదు. మావోయిస్టులను తుద ముట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నది. అబూజ్‌మఢ్ ఐదు దశాబ్దాలుగా పార్టీ అగ్ర నాయకులకు కీలక స్థావరంగా నిలుస్తున్నది. కాకులు దూరని కారడవిగా చెప్పుకుంటున్న అబూజ్‌మఢ్ స్థావరాన్ని కనిపెట్టేందుకు కొన్నేళ్లుగా కేంద్ర భద్రత బలగాలు, ఎన్‌ఐఏ ప్రయత్నిస్తున్నాయి. 2023లో ఎన్‌ఐఏకు అందిన కీలక సమాచారం ఆధారంగా అబూజ్‌మడ్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా ప్రచారంలో ఉంది. దానిని ఛేదించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా భద్రతా బలగాలను ఆపరేషన్ కగార్ పేరుతో మోహరించింది. మావోయిస్టుల వద్ద అధునాతన ఆయుధాలు లేవని, అగ్ర నాయకులంతా 60, 70 ఏళ్ల వయసు పై బడిన వారేనని భావించిన కేంద్రం ఇదే అదునుగా ఆపరేషన్ కగార్‌ను కొనసాగించింది. విప్లవో ద్యమ చరిత్రలోనే తొలిసారిగా మావోయిస్టు దళపతిని ఎన్‌కౌంటర్‌లో అంతమొందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్‌పూర్ గ్రామానికి చెందిన ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 2018 నవంబర్‌లో అనారోగ్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కీలక బాధ్యతల్లో కొనసాగుతున్న నంబాల కేశవరావు అలి యాస్ బసవరాజు, గంగన్నకు పార్టీ పగ్గాలను అప్ప గించారు. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భా వానికి ముందు 15ఏళ్ల పాటు గణపతి కొండపల్లి సీతా రామయ్య తర్వాత కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసా గారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్య దర్శిగా 2004 నుంచి 2018 వరకు పని చేశారు.
ఫ నాడు గణపతి పేరు ప్రతిపాదించిన కోటేశ్వర్‌రావు
పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిని మల్లో జుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీకి దక్కే అవ కాశం వచ్చినప్పటికీ తిరస్కరించి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పేరును ప్రతిపాదించారని సమాచారం. పీపుల్స్ వార్ ఉద్యమంలో గణపతి కంటే ముందే పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్‌రావు పీపుల్స్‌వార్ ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆయన కంటే గణపతి జూనియర్. కోటేశ్వర్‌రావు సోదరుడు వేణుగోపాల్‌రావు గణపతి తరానికి చెందిన వారు. మల్లోజుల కోటేశ్వర్‌రావు అప్పటి పీపుల్స్‌వార్ కార్య దర్శిగా పని చేసిన సమయంలో గణపతి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత గణపతి రాష్ట్ర కార్యదర్శి కాగా, కోటేశ్వర్‌రావు తమిళనాడు కార్య దర్శిగా వెళ్లాడు. కొండపల్లి సీతరామయ్య నాయకత్వం పై పార్టీలో విభేదాలు తలెత్తడంతో ఆయనను కేంద్ర కార్యదర్శి పదవి నుంచి తప్పించి గణపతికి అవకాశం కల్పించారు. ఆ సమయంలో పొలిట్‌బ్యూరో కోటేశ్వర్ రావు పేరునే ఖరారు చేసినప్పటికీ, ఆయన గణపతి పేరు సూచించారని సమాచారం.
ఫ ప్రధాన కార్యదర్శి పదవి మల్లోజులకు దక్కనుందా?
నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో నేల కొరగడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి, సాహు, అభయ్‌కు దక్కనున్నదా అనే చర్చ జరుగుతున్నది. ఆయన ప్రస్తుతం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతి నిధిగా, దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్‌గా కొనసాగుతు న్నాడు. కేరళలోని ఇడుక్కి నుంచి పశ్చిమ కనుమలకు ఇరువైపులా దక్షిణ భారత్‌లో కొత్త గెరిల్లా జోన్ ఏర్పాటు చేసేందుకు వేణుగోపాల్‌రావుకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. సాధన పేరిట రచనలు చేసే వేణుగోపాల్ అనేక పదవులను అలంకరించి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. సోదరుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ 2011 నవంబర్ 11న పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌం టర్‌లో నేలకొరిగారు. అనంతరం లాల్‌గఢ్ ప్రాంత ఉద్యమానికి, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా వేణుగోపాల్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటనకు ప్రధాన సూత్రధారి వేణుగోపాల్ అని చెబుతారు. ఉద్యమంలో వేణుగోపా ల్‌కు సహచరిగా ఉన్న గడ్చిరోలి జిల్లాకు చెందిన సిడాం విమలచంద్ర అలియాస్ తారక అలియాస్ వత్సల ఈ ఏడాది జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమం త్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. వేణు గోపాల్ ఉద్యమబాట పట్టిన నాటి నుంచి ఇంటి ముఖం చూడలేదు. నంబాల నేలకొరగడంతో ఆ పదవి వేణుగోపాల్‌రావుకే దక్కే అవకాశాలున్నాయనే ప్రచా రం జరుగుతున్నది. జిల్లాకు చెందిన మల్ల రాజిరెడ్డి అలియాస్ మురళి, సీతన్న, ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు.