రేకుర్తి కంటి ఆసుపత్రిలో విస్తృత సేవలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:31 AM
భగత్‌నగర్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని లయన్స్‌క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మదేకర్ ఉదార రేకుర్తి కంటి ఆసుపత్రిలో విస్తృత సేవలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మినహాయిస్తే ఉత్తర తెలంగాణలో ఏ పట్టణంలో లేని అరుదైన చికిత్సలను రేకుర్తి కంటి ఆసుపత్రిలో ప్రారంభించనున్నారు.
- మెల్లకన్ను, కంటి క్యాన్సర్‌కు చికిత్సలు
- 26వ తేదీన ప్రారంభం
భగత్‌నగర్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నగరంలోని లయన్స్‌క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మదేకర్ ఉదార రేకుర్తి కంటి ఆసుపత్రిలో విస్తృత సేవలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మినహాయిస్తే ఉత్తర తెలంగాణలో ఏ పట్టణంలో లేని అరుదైన చికిత్సలను రేకుర్తి కంటి ఆసుపత్రిలో ప్రారంభించనున్నారు. ఈ నెల 26వ తేదీన రేకుర్తి కంటి ఆసుపత్రిలో మెల్లకన్నుతో పాటు, కంటి క్యాన్సర్ చికిత్స కోసం ఓక్యులోఫ్లాస్టీ చికిత్సలను అందుబాటులోకి తేనున్నారు. ప్రతీనెల ఒకరోజు ఈచికిత్సల కోసం వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. దీనితో కంటి సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా రేకుర్తిలోనే చికిత్సలు అందించడానికి ఏర్పాట్లు చేశారు.
ఫ మెల్ల కన్నుకు చికిత్స
లయన్స్‌క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యశాల లో మెల్లకన్నుకు చికిత్సను ప్రారంభిస్తున్నారు. చిన్న పిల్లల్లో కంటి సమస్యలు, చిన్న పిల్లల్లో శుక్లమ్ (మోతె బిందు) కంటి నరానికి సంబంధించిన చికిత్స కోసం నిఫుణులైన వైద్యులు వచ్చి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఫ కంటి క్యాన్సర్, ఓక్యులోప్లాస్టీ చికిత్స
కంటి క్యాన్సర్‌కు సంబంధించి ఓక్యులోప్లాస్టీ చికిత్సను ఈ నెల26వ తేదీన రేకుర్తిలో చికిత్స అందించనున్నారు. కన్నులో అద్దంలో వలె తళుక్ మొదలవ్వగానే కళ్లలో తేడా తెలుస్తుంది. మెల్లకన్ను లక్షణం ఉంటుంది. కళ్లలో మునుపటి కన్నా చూపు తక్కువవుతుంది. కళ్ల నుంచి నీరుకారుతుంది పొద్దున లేవగానే కళ్లు ఎర్రబడే లక్షణాలు కనిపిస్తాయి. కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. ప్రోస్టేట్సిస్ చికిత్స, ఒకకన్ను చిన్నగా కనిపిస్తుంది, రేటినో బ్లాస్టోమాను (ఇది ఒక కంటి క్యాన్సర్ పండు) మొదటి దశలో కనుగొని చికిత్స ప్రారంభిస్తే రోగాన్ని నయం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ అవకాశాన్ని వినియోగించుకోవాలి
- కొండా వేణుమూర్తి, చైర్మన్ రేకుర్తి కంటి ఆసుపత్రి
రేకుర్తి కంటి ఆసుపత్రిలో మెల్లకన్ను, ఓక్యూలోఫ్లాస్టీ సేవలను రేకుర్తిలో ప్రారంభిస్తున్నాము. కొత్తగా సర్జికల్ రెటినా సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.