బీజేపీ ఎంపీలు మోదీ వద్ద ఎందుకు మాట్లాడటం లేదు
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:17 AM
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రధానమంత్రి మోదీ దగ్గర ఎందుకు బీసీ బిల్లు గురించి మాట్లాడటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రధానమంత్రి మోదీ దగ్గర ఎందుకు బీసీ బిల్లు గురించి మాట్లాడటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అఖిలపక్షం నాయకులతో కలిసి బైక్‌పై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమా వేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సపరిం చారన్నారు. బీసీ బిల్లు అమలుపై ఆర్డినెన్స్ జాజీ చేయవలిసిందిగా గవర్నర్‌కు పంపారన్నారు. బీసీ బిల్లుపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని తెలి పారు. రాష్ట్రంలోని బీజేపీ కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్య క్షుడు రామచంద్రంరావు బాధ్యత వహించి నరేంద్రమోదీని ఒప్పించి అపాయింట్ మెంట్ తీసుకుని 42శాతం రిజ్వేషన్ అమలయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు మోదీని ఒప్పించాలన్నారు. బీజేపీ నాయకులు రాష్ట్రం లో సై అంటున్నారని, ఢిల్లీలో నై అంటున్నారని, ఎందుకు యూటర్న్ తీసుకుంటు న్నారని నిలదీశారు. బీసీ బిడ్డల నోటికి వచ్చిన బుక్కను తీసివేయవద్దని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల వారికి బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్‌ఎస్ వాళ్లే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేక పోతున్నారని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం సిద్దంగా ఉందని, కోర్టులపై పూర్తి నమ్మకం ఉందని, కోర్టు ఎక్కడ తాము చేసిన చట్టాన్ని ఎక్కడ తప్పుపట్టలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి ప్రజల మనోభావాలు ప్రతిబిం చించేలా బంద్ చేపట్టడం జరుగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.