Share News

భీమన్న సన్నిధిలో విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ పూజలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:52 AM

వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.

భీమన్న సన్నిధిలో విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ పూజలు

వేములవాడ టౌన్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌లు కొడె మొక్కులు చెల్లించారు. భీమన్న ఆలయంలో స్వామివారికి నివేదన జరుగుతున్న సందర్భం గా అరగంటసేపు నిరీక్షించారు. అనంతరం భీమన్న స్వామివారిని దర్శించుకు న్నారు. ఆలయ మండ పంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇవ్వగా, ఈవో రమాదేవి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు.

భీమన్న సన్నిధిలో ఏర్పాట్ల పరిశీలన

భీమేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. కోడెల క్యూ లైన్‌, ఉచిత దర్శనం, అభిషేకం క్యూలైన్‌లను పరిశీలించారు. కల్యాణకట్టలో పరిశీ లించి వేడినీరు తదితర సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి, డీఈ రఘునందన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, కట్కూరి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:52 AM