Share News

అభివృద్ధి పనుల పరిశీలించిన విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:47 AM

వేములవాడలో జరుగుతు న్న అభివృద్ధి పనుల పురోగతిని మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పరిశీలించారు.

అభివృద్ధి పనుల పరిశీలించిన విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌

వేములవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వేములవాడలో జరుగుతు న్న అభివృద్ధి పనుల పురోగతిని మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ సంద ర్భంగా పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. మొత్తం రూ.5కోట్ల 61 లక్షల వ్యయంతో 144 ఇళ్లు నిర్మిస్తున్నామని అధికారులు విప్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మూలవా గు బ్రిడ్జిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. వాగులో ప్రస్తుతం నడుస్తున్న ఫైల్స్‌ పనులను దగ్గరుండి తెలుసుకున్నారు. అక్కడి నుంచి అమ రవీరుల స్తూపం నుంచి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు పనులు, కొనసాగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి సంబం ధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, డబుల్‌ బెడ్రూం ఇళ్ల పనులు పరిశీలిస్తున్న సమయంలో బేస్మెంట్‌ ఫ్లోరింగ్‌ ఒక్కసారిగా కుంగ డంతో ప్రభుత్వ విప్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌లు కింద పడబోయారు. అక్కడే ఉన్న నాయకులు వారిని కిందపడకుండా పట్టుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరు అవాక్కయ్యారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంట ఆర్డీవో రాధాబాయి, కమిషనర్‌ అన్వేష్‌, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు తదితరలు ఉన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:47 AM