యాసంగిలో ఆరుతడి పంటలను పండించాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:55 AM
యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి అప్జల్ బేగం సూచించారు.

రుద్రంగి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి అప్జల్ బేగం సూచించారు. మండల కేంద్రంతోపాటు మానాల లో అఫ్జల్ బేగం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి కాలంలో ముందస్తుగా వరి పంటను నాటుకున్నట్లైతే వరిలో ఆఖరి దశ నీటి ఎద్దడి నుంచి కాపాడుకొని అధికలాభాలు పొందవచ్చని సూచించారు. మానా లలో యసంగిలో ఆరుతడి పంటలు పండిస్తూ అధిక లాభాలు గడిస్తున్న రైతు జక్కు మహేష్‌ని ఆదర్శంగా తీసుకొని ఇతర పంటలను సాగు చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలు సాగు చేయవచ్చని సూచించారు. ఆరు తడి పంటలలో డ్రిప్, స్ర్పింక్లర్లను ఉపయోగించడం ద్వారా నీటి వృథాను తగ్గించి తక్కువ నీటితో అధిక లాభాలు రైతులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో దుర్గరాజు, రుద్రంగి మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, ఏఈవో జ్యోతి, రైతులు గడ్డం స్వామి, వెంక టేష్, కొల రాజిరెడ్డి, చంద రాజేశం పాల్గొన్నారు.