Share News

అర్చకులకు సంక్షేమం

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:21 AM

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన సం క్షేమ నిధి నుంచి ఆలయాల్లో పని చేసే రెగ్యులర్‌ అర్చ కులు, ఉద్యోగులతోపాటు ధూప దీప నైవేద్య పథకం పరిధిలోని అర్చకులకు సైతం ఆర్థిక సాయాన్ని అం దించనున్నది.

 అర్చకులకు సంక్షేమం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన సం క్షేమ నిధి నుంచి ఆలయాల్లో పని చేసే రెగ్యులర్‌ అర్చ కులు, ఉద్యోగులతోపాటు ధూప దీప నైవేద్య పథకం పరిధిలోని అర్చకులకు సైతం ఆర్థిక సాయాన్ని అం దించనున్నది. సంక్షేమ నిధి వర్తింపులో ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చి ఆర్థిక సాయాన్ని పెంచింది. దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు, ధూప దీప నైవేద్య (డీడీఎన్‌) అర్చకులకు ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంగా విధివిధానాలను ప్రకటించింది.

ఈ ప్రయోజనాలు అర్చక ఉద్యోగుల సేవాకాల ఆధారంగా అందుతాయి. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, వివాహ పథకం, ఉపనయనం, ఇంటి నిర్మాణం, మర మ్మతులు, విద్య తదితర అంశాల్లో లబ్ధి జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా అర్చకులు, ఉద్యోగులకు పలు ప్రయో జనాలు కల్పించేందుకు ఒక ట్రస్టును నెలకొల్పి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. తద్వారా పది రకాల ప్రయో జనాలను అందించనున్నది. పెద్దపల్లి జిల్లాలో ధూప దీప నైవేద్య పథకం 153 ఆలయాల్లో అమలవుతున్నది. కొత్తగా మరో 70 ఆలయాలకు పథకాన్ని వర్తింపజేయా లని గత నెలలో దరఖాస్తు చేశారు. ఇందులో కొన్ని దేవాలయాలకు పథకాన్ని వర్తింప చేయనున్నారు.

ఫ సంక్షేమ నిధి ద్వారా అందే ప్రయోజనాలు..

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆలయ అర్చక ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా పది రకాల ప్రయోజనాలు అమలులో ఉన్నాయి. అర్చక ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ గ్రాట్యూటీ (మరణానంతరం) 20 ఏళ్లకు పైగా సేవలం దించే వారైతే రూ.8 లక్షలు, 15-20 ఏళ్ల మధ్య సర్వీసు కలిగిన వారికి రూ.6 లక్షలు, 10-15 ఏళ్ల సర్వీసు ఉంటే రూ.4 లక్షలు, పదేళ్ల కనీస సర్వీస్‌ పూర్తికాక ముందే మృతి చెందితే 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు.

అలాగే ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు గ్రాట్యూటీ రూపంలో సర్వీసు ఆధారంగా రూ.4 లక్షలు, రూ.3 లక్షలు, లక్ష రూపాయలు అందుతాయి. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గ్రాంటు కింద మెడికల్‌ బోర్డు సిఫా రస్‌తో గరిష్టంగా 2 లక్షల రూపాయలు అందించను న్నారు. వివాహ పథకం కింద రెగ్యులర్‌ ఉద్యోగులు కన్సల్టేటెడ్‌ ధూప దీప నైవేద్య అర్చకులకు 1,01,116 రూపాయలు అందిస్తారు. రెగ్యులర్‌ ఉద్యోగులకైతే రు ణంగా 2 లక్షల రూపాయలు, మహిళ ఉద్యోగితోపాటు ఆమె కుమార్తె సోదరి వివాహానికి లక్షా 25 వేలు అంది స్తారు. ఉపనయం గ్రాంటు కింద 50 వేల రూపాయలు అందించనున్నారు. మరణానంతరం వృత్తి రీత్యా 50 వేల రూపాయలు, అంతిమ సంస్కారాలకు 30 వేల రూపాయలు అందిస్తారు. ఇంటి నిర్మాణానికి 50 వేలు, రెగ్యులర్‌ ఉద్యోగులకైతే 4 లక్షల మేర బ్యాంక్‌ రుణంపై వడ్డీ మొత్తం ఐదేళ్ల వరకు చెల్లిస్తారు. విద్యా పథకం ద్వారా గ్రాడ్యుయేషన్‌, పీజీ, పీహెచ్‌ కోర్సులకు యేటా 35 వేల రూపాయలు రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. దివ్యాంగులైన ఉద్యోగులకు కనీసం ఐదు నుంచి పదేళ్ల సర్వీసు పూర్తయితే లక్ష, పదే ళ్లకు పైగా సర్వీసు ఉంటే 2 లక్షలు అందిస్తారు.

ఫ నెలనెలా వేతనాలు ఇవ్వాలి..

ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఇచ్చే వేతనాలు, పూజా సామగ్రికి ఇచ్చే డబ్బులను నెల నెలా ఇవ్వాలని అర్చకులు అంటున్నారు. మూడు నాలుగు నెలలకోసారి ఇవ్వడం వల్ల డబ్బులు సర్దుబాటు చేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తున్నదని అర్చకులు వాపోతు న్నారు. అలాగే ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే డీడీఎన్‌ పథకం కింద ఇచ్చే 10 వేలను 12 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు పెంచలేదని అర్చకులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో పూజా సామగ్రి, కిరాణ సరుకు లు పెరుగుతున్నాయని, తదనుగుణంగా ప్రభుత్వం తమకు ఇచ్చే 6 వేల వేతనం, ధూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే 4 వేలు ఏ మాత్రం సరిపోవడం లేదని, అప్పులు చేయాల్సి వస్తున్నదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దేవాలయాలకే వర్తింపజేస్తు న్నందున పెద్దగా భక్తులు రారని, వారానికి ఒకసారి వచ్చే భక్తుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమేనని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నెలనెలా వేతనాలు ఇవ్వడంతోపాటు, ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని అర్చకులు కోరుతున్నారు.

ఫ ధూప దీప నైవేద్యం నిధిని పెంచాలి

- నిట్టూరి సతీష్‌ శర్మ, దూప దీప నైవేద్య పథకం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధూప దీప నైవేద్యం పథకం కింద రూ.10 వేలు ఇస్తున్నది. ఏడాది న్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదు. ప్రస్తుతం అర్చకులకు వేతనంగా రూ.6 వేలు, ధూప దీప నైవేద్యాలకు 4 వేలు ఇస్తున్నారు. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. మార్కె ట్‌లో ధరలు పెరిగిన కారణంగా ధూప దీప నైవేద్యా లకు కనీసం రూ.6 వేలు ఖర్చవుతున్నాయి. ఈ పథకం కింద నెలకు రూ.16 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఆలకించడం లేదు. కుటుంబాలను పోషిం చడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధిని రూ.16 వేలకు పెంచి, ప్రతీ నెలా మొదటి వారంలోనే తమ ఖాతాల్లో జమ చేయాలి.

Updated Date - Jul 02 , 2025 | 01:22 AM