Share News

తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:03 AM

కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు.

తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి

చందుర్తి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. చందుర్తి మండలం మల్యాల, లింగంపేట గ్రామాల్లోని ఐకేపీ ఆధ్వ ర్యంలో, సనుగుల గ్రామంలో ప్యాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడాతూ ధాన్యం విక్రయాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదే శించారు. వెంట రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలు కల తిరుపతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సీఐ వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మల్లేశం, డైరెక్టర్లు శంకర్‌, కృష్ణ, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:03 AM