పోలీస్ కమిషనరేట్‌లో ఆయుధ పూజ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:01 PM
: కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో దసరా సందర్భంగా బుధవారం నిర్వహించిన ఆయుధ, జమ్మి, వాహన పూజా కార్యక్రమాల్లో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో దసరా సందర్భంగా బుధవారం నిర్వహించిన ఆయుధ, జమ్మి, వాహన పూజా కార్యక్రమాల్లో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఏఆర్) భీంరావు, ఏసీపీలు విజయ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, జానీమియా, శ్రీధర్‌రెడ్డి, కిరణ్ కుమార్, పీఐలు శ్రీనివాస్, రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, బిల్లా కోటేశ్వర్, సరిలాల్ పాల్గొన్నారు.