పార్టీ సర్పంచ్‌లకు అండగా ఉంటాం..
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:22 AM
బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌లకు లీగ ల్‌గా, సాంకేతిక సమస్యలపైన బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా ఉంటుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌లకు లీగ ల్‌గా, సాంకేతిక సమస్యలపైన బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా ఉంటుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లా డారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం కోసం బీఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని పంచా యతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించిన గ్రామ ప్రజలంద రికి బీఆర్‌ఎస్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. మూడ విడతలో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 80 స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందన్నారు. ఓడిన గ్రామాలలో కూడా తాము బలపరిచిన అభ్యర్థులు కేవలం రెండు లేదా మూడు ఓట్లతోనే ఓడినారని పార్టీ సహిత ఎన్నికలైతే ఈ రోజు కాంగ్రెస్, బీజేపీకి గుండు సున్న వచ్చేదని అన్నారు. రానున్న పార్టీ సహిత గుర్తుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రజా పాలనను మెచ్చి రాష్ట్రంలో అధిక స్థానా లను ప్రజలు కట్టబెట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రగ ల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అధికార బలంతో ఎక్క డికక్కడ అధికారులను అడ్డం పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడారని ఆరోపించారు. కాంగ్రెస్ రెండు సంవ త్సరాల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యం కాబట్టే గ్రామాల్లో ప్రజలు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఓట్లు వేశారన్నారు. గ్రామాలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గ్రామల సమస్యల సాధన కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, మాజీ ఎంపీపీ గజభీంకార్ రాజన్న, జిల్లా నాయకు డు బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు.