Share News

గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:31 AM

గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్‌ మల్లికార్జున రాజేందర్‌ అన్నారు.

గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం

భగత్‌నగర్‌, జూన్‌29 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్‌ మల్లికార్జున రాజేందర్‌ అన్నారు. ఆదివారం గృహ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని రేకుర్తిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రాజేందర్‌ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. నిర్మాణ రంగంలోని కార్మికులకు, వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. గృహ నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ బీమా, చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా కోసం కృషి చేస్తామని అన్నారు. అందరి సహకారంతో కార్మిక సంఘం సొంత భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. 26 ఏళ్లగా సంఘంలోని కార్మికులందరూ స్నేహభావంతో కలిసికట్టుగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారుడు మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, న్యాయ సలహాదారుడు కిరణ్‌కుమార్‌, మాజీ వైస్‌చైర్మన్‌ డి వెంకటస్వామి, గౌరవ అధ్యక్షుడు బి మురళి, సలహాదారులు కె వెంకటేశ్వర్లు, ఆర్‌ వెంకటరమణ, అధ్యక్షుడు బి చెంచయ్య, ఉపాధ్యక్షుడు కె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే బాబు, ఉప కార్యదర్శులు టి శ్రీను, జి పవన్‌, కోశాధికారి టి శ్రీనివాస్‌, ఉప కోశాధికారి ఎం సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:31 AM