Share News

‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’తో ప్రజలను చైతన్యపరుస్తాం

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:07 AM

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో అన్ని వర్గాల ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల బాకీ పడిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు.

‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’తో ప్రజలను చైతన్యపరుస్తాం

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో అన్ని వర్గాల ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల బాకీ పడిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్‌ బాకీ కార్డు ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్కానగడ్డ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి భరోసాకార్డుతో మభ్యపెట్టి అధికా రంలోకి వచ్చిందని, 22 నెలల కాంగ్రెస్‌ పాలనలో హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయక పోవడంతో వారిచ్చిన హామీ మేరకు ప్రజలకు ప్రభుత్వం బాకీ పడి, అప్పుల ప్రభుత్వంగా మారిందని, రేవంత్‌ సర్కార్‌ సిబిల్‌ స్కోర్‌ పడిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలను ఎప్పటి వరకు ఇస్తారో సీఎం రేవంత్‌రెడ్డి గడువు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బకాయి ఉన్నందున ఆయన ఇంటి ముందు డప్పు కొట్టి నిరసన తెలుపాలని ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు నెలకు 2,500 చొప్పున ఇస్తామని 55వేల బకాయి పడిందని, స్కూటీలు ఇవ్వలే దని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం లబ్దిదారులకు తులం బంగారం బాకీ ఉందని, వృద్ధు లు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లను రెట్టింపు చేస్తామన్నందున ఒక్కొక్కరికి 44 వేల నుంచి 66 వేల వరకు బకాయి పడిందని అన్నారు. రైతులకు 76 వేలు ఇలా వారిచ్చిన హామీ లను అమలు చేస్తే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం ఇప్పటికే లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, సంవత్స రానికి 20వేల కోట్ల చొప్పున రెండేళ్లలో ఇస్తామన్న 40వేల కోట్లను ఇవ్వకుండా మోసం చేశారన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా మాజీ చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Updated Date - Oct 11 , 2025 | 12:07 AM