నిర్వాసితుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:01 AM
వేములవా డ మండలంలోని ఆయా గ్రామాల నిర్వాసితుల పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వేములవా డ మండలంలోని ఆయా గ్రామాల నిర్వాసితుల పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం సంకెపల్లి గ్రా మానికి చెందిన నిర్వసితులు కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతపల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్‌ను కలి శారు. ఈసందర్భంగా గ్రామంలో 45మందికి ఇండ్ల పరిహా రం అందించాలని ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సంకెపల్లి గ్రామా నికి చెందిన పెండింగ్‌లో వున్న అర్హులైన నిర్వసితుల సమ స్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్‌తో మాట్లా డానని అతి త్వరలో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి శ్రీనివాస్ రావు, రగుడు పర్శరాములు, మారవేని రాజ్‌కుమార్ గ్రామస్థులు తదితరులు ఉన్నారు.