రైతులు, వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ABN , Publish Date - May 19 , 2025 | 12:47 AM
రైతు బజార్‌లోని రైతులు, చిరు వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది ఆది శ్రీని వాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి) : రైతు బజార్‌లోని రైతులు, చిరు వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది ఆది శ్రీని వాస్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, జిల్లా గ్రంథా లయం ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. రైతు బజార్‌లో పర్యటిస్తూ రైతులు, వ్యాపారులతో మమేకమై వారి సమస్యలను ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులు, కూరగాయాల విక్రేతలకు సౌకర్యంగా ఉండేలా షెడ్లు నిర్మిస్తామని రైతు బజార్‌లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్డీవో వెంకటే శ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్య క్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఎండీ ఖాజా, ఆడెపు జగన్, నక్క నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారా యణ, కుడిక్యాల రవికుమార్, వేముల రవి, వెంగళ లక్ష్మినర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.