Share News

పంటకు మద్దతు ధర చెల్లిస్తాం..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:04 AM

రైతుల పంటల కు మద్దతు ధరనిస్తూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్‌, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పంటకు మద్దతు ధర చెల్లిస్తాం..

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : రైతుల పంటల కు మద్దతు ధరనిస్తూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్‌, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని బాల్‌నగర్‌, రూరల్‌ మండలంలోని మల్లారం, చెక్కపల్లి గ్రామాలలో ప్యాక్స్‌ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు. జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటుచేస్తామని, అందులో ఇప్పటికే 35 సెంటర్ల ను ప్రారంభించామన్నారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా గ్రంధాలయ చైర్మెన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, ప్యాక్స్‌ చైర్మెన్‌ ఏనుగు తిరు పతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ కనికరపు రాకేష్‌ జిల్లా పౌర సరఫరాల శాక అధికారి వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:04 AM